రికార్డుల రారాజు సచిన్ టెండూల్కర్. భారత క్రికెట్ కు వన్నె తెచ్చిన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. మైదానంలో సచిన్….సచిన్..అనే అరుపులు సచిన్ అభిమానులకు ఇప్పటికి గుర్తు ఉంటాయి
డబల్ సెంచరీ అనే పదం కేవలం టెస్ట్ మ్యాచ్ లకు సంబంధించింది ఒకప్పుడు. అయితే ఎప్పుడైతే వన్ డే ల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తొలి డబల్ సెంచరీ నమోదు చేశాడో, అప్పటి నుండి వన్ డే ల్లో చాల డబల్ సెంచరీలు నమోదయ్యాయి. సచిన్ వన్ డే ల్లో సౌత్ ఆఫ్రికా పై చేసిన మొదటి డబల్ సెంచరీ కి 15 ఏళ్ళు. ఈ విషయమై బీసీసీఐ ఎక్స్ లో పోస్ట్ చేసింది
2010 ఫిబ్రవరి 24 న భారత, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య గ్వాలియర్ లో జరిగిన వన్ డే మ్యాచ్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 147 బంతుల్లో సరిగ్గా 200 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 25 ఫోరులు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో భారత్ 3 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ చేసింది. సౌత్ ఆఫ్రికా 248 పరుగులకు అల్ అవుట్ అయ్యింది
వన్ డే ల్లో తొలి డబల్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆ తరవాత చాలామంది డబల్ సెంచరీలు చేశారు. అయితే, సచిన్ డబల్ సెంచరీ మాత్రం ఎప్పటికి ప్రత్యేకమే.
వన్ డే ల్లో, టెస్ట్ ల్లో అత్యధిక పరుగులు చేసి రికార్డు కూడా సచిన్ పేరు మీదే ఉన్నాయి. సచిన్ వన్ డే ల్లో 18.425 పరుగులు, టెస్ట్ ల్లో 15,921 పరుగులు చేశాడు. క్రికెట్ లో 24 ఏళ్ళు కెరీర్ ను కొనసాగించడం అంటే మాములు విషయం కాదు.
ఈ బీసీసీఐ లింక్ ను కాపీ చేసి బ్రౌజర్ లో పేస్ట్ చేయండి

