మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన గేమ్ ఛేంజర్ మూవీ 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశ పరిచింది. దాంతో ప్రస్తుతం అందరి దృష్టి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్సీ16 సినిమాపై ఉంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘ఆర్సీ16’ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. కాగా, కుస్తీతో పాటు క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు. అయితే, తాజాగా ‘ఆర్సీ16’ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా.. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్, దివ్యేందులపై క్రికెట్ బ్యాగ్డ్రాప్ సీన్స్ షూట్ చేశారు. ఇక ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మార్చి మొదటి వారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో రామ్‌చరణ్‌తో పాటు ఇతర ముఖ్య నటులపై కుస్తీ బ్యాగ్డ్రాప్ సీన్స్ షూట్ చేయనున్నట్లు సమాచారం. కాగా, మార్చి 27న రామ్‌చరణ్ బర్త్ డే కానుకగా టైటిల్, టీజర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. జాన్వీకపూర్‌కు దేవర తర్వాత తెలుగులో ఇది రెండో సినిమా అనే విషయం తెలిసిందే.

