బన్నీ – త్రివిక్రమ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ 

by | Feb 24, 2025 | సినిమా

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌ టైటిల్‌ పాత్రలో నటించిన సీక్వెల్‌ మూవీ పుష్ప 2 ది రూల్‌. స్టార్ దర్శకుడు సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించింది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సీక్వెల్‌కు దేవీ శ్రీ ప్రసాద్, అద్భుతమైన మ్యూజిక్‌ అందించారు. అయితే ఈ సినిమా త‌ర్వాత అల్లు అర్జున్ తర్వాతి ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అల్లు అర్జున్ త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్లు సమాచారం.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. మార్చి రెండో వారంలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ లేకుండా కొన్ని సీన్స్ తెరకెక్కించనున్నారట. మొదటి రెండు షెడ్యూల్స్ ముగిశాక జూన్ నుంచి అల్లు అర్జున్ ఈ మూవీ సెట్స్ లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. కాగా జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. త్వరలోనే అన్ని వివరాల‌ను చిత్ర‌ యూనిట్ అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. కాగా, అల్లు అర్జున్‌తో సినిమా కోసం త్రివిక్రమ్‌ సోషల్‌ మైథలాజికల్‌ ఫ్యాంటసీ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. పరమేశ్వరుడి కుమారుడైన కార్తికేయుడి కథ ఏంటి అనే కథాంశంతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాను హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ, నాగవంశీ నిర్మించనున్నారు.