ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో యూపీ వారియర్స్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.
హెన్రీ విధ్వంసకర బ్యాటింగ్, హారిస్ హ్యాట్రిక్, క్రాంతి గౌడ్ 4 వికెట్స్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో యూపీ వారియర్స్ కు మొదటి విజయాన్ని అందించాయి.
178 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 వర్ల లో 144 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.
ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్ మెగా లానింగ్ 5 పరుగులు చేసి గౌడ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యింది
షెఫాలీ వర్మ 24 పరుగులు చేసి గౌడ్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యింది. ఆ తరవాత క్రమం తప్పకుండ ఒక వైపు వికెట్లు పడుతూ ఉన్నా, జెమిమా రోడ్రిగ్స్ ధాటిగా ఆడుతూ 35 బంతుల్లో 56 పరుగులు చేసి అవుట్ అయ్యింది
చివర్లో నికి ప్రసాద్, శిఖా పాండే ధాటిగా ఆడుతూ మ్యాచ్ మీద ఆశలు రేకెత్తించారు. అయితే నికి ప్రసాద్ 18 పరుగులు, శిఖా పాండే 15 పరుగులు చేసి వెంట వెంటనే అవుట్ అయ్యారు. ఆ తరవాత హారిస్ హ్యాట్రిక్ తీయడంతో గెలుపు లాంఛనం అయ్యింది
హారిస్ 20 ఓవర్ మొదటి మూడు బంతులతో వరసగా నికి ప్రసాద్, అరుంధతి రెడ్డి, మిన్ను మని లను అవుట్ చేసింది.
యూపీ వారియర్స్ బౌలర్ల లో క్రాంతి గౌడ్, హారిస్ నాలుగేసి వికెట్లు తీయగా, హెన్రీ, దీప్తి శర్మ చెరో ఒక వికెట్ తీశారు
అంతకు ముందు, టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది
మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
యూపీ వారియర్స్ బ్యాటింగ్ వికెట్లు పడుతున్నా, స్కోర్ బోర్డు కదులుతూ సాగింది.
ఆఖర్లో హెన్రీ ఆట హైలైట్. హెన్రీ కేవలం 23 బంతుల్లో 62 పరుగులు చేసి విధ్వంసం సృష్టించింది. ఇందులో 8 సిక్సర్లు ఉన్నాయంటే విధ్వంసం ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. హెన్రీ 62 పరుగులు చేస్తే, మిగతా తొమ్మిది మంది కలిపి 115 పరుగులు చేశారు
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో జొనాసేన్ నాలుగు వికెట్లు తీయగా, అరుంధతి రెడ్డి, మారిజాన్నే కప్ చెరో రెండు వికెట్లు తీశారు. శిఖా పాండే ఒక వికెట్ తీసింది

