C ట్రోఫీ : 351 పరుగుల లక్ష్యాన్ని చేధించిన ఆస్ట్రేలియా

by | Feb 22, 2025 | వార్తలు

ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా ఈ రోజు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 351 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది.

కొండంత లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి, ఇంకా 2.3 ఓవర్లు మిగిలి ఉండగానే చేధించింది

352 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల లోతు కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ 6 పరుగులు, కెప్టెన్ స్మిత్ 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు

అయితే మరో ఓపెనర్ షార్ట్, లబుషేన్ మూడవ వికెట్ కు 95 పరుగులు జోడించారు. 47 పరుగులు చేసిన లబుషేన్ రషీద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.  ఆ వెంటనే 63 పరుగులు చేసిన షార్ట్ కూడా లివింగ్ స్టోన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు

136 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ను జొస్ ఇంగ్లీష్, అలెక్స్ క్యారీ ఆదుకున్నారు.   వీరిద్దరూ ఐదవ వికెట్ కు, చేధించాల్సిన లక్ష్యాన్ని కరగిస్తూ,  146 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  అలెక్స్ క్యారీ 63 బంతుల్లో 69 పరుగులు చేశాడు.  

ఆ తర్వాత వచ్చిన మాక్స్ వెల్, జొస్ ఇంగ్లీష్ తో కలిసి ఉతకడం మొదలు పెట్టారు.  ఈ క్రమంలో జొస్ ఇంగ్లీష్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు

మాక్స్ వెల్, జొస్ ఇంగ్లీష్ ఆరవ వికెట్ కు అజేయంగా పరుగులు జోడించి 352 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఆస్ట్రేలియా ను గెలిపించారు 

జొస్ ఇంగ్లీష్ 86 బంతుల్లో 120 పరుగులు,  మాక్స్ వెల్ 15 బంతుల్లో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.

ఇంగ్లాండ్ బౌలర్ల లో వుడ్, ఆర్చర్, కార్స్, రషీద్, లివింగ్ స్టోన్ తల ఒక వికెట్ తీశారు.  రషీద్ మినహాయించి మిగతా ఇంగ్లాండ్ బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చారు.

అంతకు ముందు, మొదట బ్యాటింగ్ చేసిన,  ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్ల లో 8 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది.

ఓపెనర్ ఫిల్ సాల్ట్ 10 పరుగులు, వన్ డౌన్ లో వచ్చిన స్మిత్ 15 పరుగులు చేసి అవుట్ అయ్యారు

అయితే మరో ఓపెనర్ డకెట్, జో రూట్ మూడవ వికెట్ కు 158 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  68 పరుగులు చేసిన జో రూట్ జంపా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

ఆ తవాత వచ్చిన హరీ బ్రూక్ తన పూర్ ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. స్పిన్ ఆడడంలో తన బలహీనతని మరో సారి బయట పెట్టుకున్నాడు. 3 పరుగులు చేసిన బ్రూక్ స్పిన్నర్ జంపా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన, కెప్టెన్ బట్లర్ 23 పరుగులు, లివింగ్ స్టోన్ 14 పరుగులు చేసి అవుట్ అయ్యారు

మరో ఓపెనర్ డకెట్ క్రీజ్ లో పాటుకు పోవడమే కాకుండా దూకుడైన ఆట ఆడాడు.  143 బంతుల్లో 165 పరుగులు చేసి లబుషేన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు

ఆస్ట్రేలియా బౌలర్ల లో ఆస్ట్రేలియా బౌలర్ల లో మూడు వికెట్లు తీయగా, స్పిన్నర్ జంపా, లబుషేన్ చెరో రెండు వికెట్లు తీశారు.  మాక్స్ వెల్ ఒక వికెట్ తీశాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ లో సెంచరీల మోత మోగిపోతోంది.  ఇప్పటివరకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ లో 7 సెంచరీలు నమోదయ్యాయి