యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. భారీ బడ్జెట్ తో యష్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా, యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో 6వ చిత్రంగా, 2019లో వచ్చిన ‘వార్’ సీక్వెల్ గా ‘వార్ 2’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉండే స్పై ఏజెంట్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
హై ఇంటెన్సిటీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో లాస్ట్ సాంగ్ ను షూట్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ కలిసి స్టెప్పులెయ్యనున్నట్లు తెలుస్తోంది. డ్యాన్స్ ఫీస్ట్ గా రూపొందించనున్న ఈ సాంగ్ కి ‘దేవర’ మూవీలో ‘చుట్టమల్లే చుట్టేసింది’ సాంగ్ కు కొరియోగ్రఫీ అందించిన బాస్కో మార్టిస్ మరోసారి తన టాలెంట్ తో మెస్మరైస్ చేయనున్నారు. మొత్తానికి వార్-2 మూవీని ఎన్టీఆర్ సాలిడ్ సాంగ్ తో ముగిస్తున్నాడు అని చెప్పొచ్చు. ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది
మరోవైపు ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్‌నీల్ డైరెక్షన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ రూపొందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. మార్చి మొదటి వారంలో ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్ లో చేరనున్నట్లు తెలుస్తోంది.

