ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.
కెప్టెన్ స్మృతి మంధన ధాటిగా ఆడే క్రమంలో 13 బంతుల్లో 26 పరుగులు చేసి అవుట్ అయ్యింది
ఎల్లీస్ పెర్రీ కేవలం 43 బంతుల్లో 81 పరుగులు చేసి, జట్టు భారీ స్కోర్ సాధించేలా చేసింది. రిచా ఘోష్ 25 బంతుల్లో 28 పరుగులు చేసి పెర్రీ కి చక్కని సహకారం అందించింది. మిగతా ప్లేయర్స్ ఎవరు రెండంకెల స్కోర్ చేయలేదు.
ముంబై ఇండియన్స్ బౌలర్లలో అమన్ జోత్ కౌర్ మూడు వికెట్ లు తీయగా ఇస్మాయిల్, బృంట్, మాధ్యుస్, సంస్కృతి గుప్త తలా ఒక వికెట్ తీశారు
అనంతరం 168 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ కు సరైన శుభారంభం లభించలేదు వన్ డౌన్ లో వచ్చిన నాట్ శివర్ బృంట్ 21 బంతుల్లో 42 పరుగులు చేసి గార్త్ బౌలింగ్ లో అవుట్ అయ్యింది
కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్, అమన్ జోత్ ఐదవ వికెట్ కు 62 పరుగులు జోడించారు. హర్మాన్ ప్రీత్ కౌర్ 38 బంతుల్లో 50 పరుగులు చేసి అవుట్ అయ్యింది. అమన్ జోత్ 27 బంతుల్లో 34 పరుగులు (2 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి) చేసి అజేయంగా నిలిచింది. అండర్ 19 టీం లో ఆడిన 16 ఏళ్ళ కమలిని 8 బంతుల్లో 11 పరుగులు చేసింది.
గెలవడానికి, రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సిన సమయంలో , కమలిని ఫోర్ కొట్టి ముంబై ఇండియన్స్ ని గెలిపించింది
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బౌలర్ల లో వారెహామ్ మూడు వికెట్ లు తీయగా, కిమ్ గార్త్ రెండు వికెట్లు తీసింది, , బిస్త్ ఒక వికెట్ తీశారు

