ఛాంపియన్స్ ట్రోఫీ : ఆఫ్ఘానిస్తాన్ పై సౌత్ ఆఫ్రికా ఘన విజయం

by | Feb 21, 2025 | వార్తలు

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో, సౌత్ ఆఫ్రికా 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది

316 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ,  208 పరుగులకు అల్ అవుట్ అయ్యింది

ఒంటరి పోరాటం చేసిన రహ్మత్ షా, 90 పరుగులు చేసి ఆఖరి వికెట్ గా వెనుతిరిగాడు.  ఆతనికి సహకారం అందించే వారు కరువయ్యారు

సౌత్ ఆఫ్రికా బౌలర్లలో రబడా మూడు వికెట్లు తీయగా, ఎంగిడి, ముల్డర్ రెండేసి వికెట్లు తీశారు.   జన్సెన్, కేశవ్ మహారాజ్ చెరో ఒక వికెట్ తీశారు

 అంతకు ముందు టాస్ గెలిచి, మొదట బ్యాటింగ్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ జార్జి 11 పరుగులకే అవుట్ అయ్యాడు.

అయితే ఆ తరవాత వచ్చిన కెప్టెన్ బావుమాతో మరో ఓపెనర్ రికెల్టన్ రెండవ వికెట్ కు 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు

58 పరుగులు చేసిన బావుమా నబి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన వాండర్ డస్సెన్ 52 పరుగులు చేయగా, మార్ క్రమ్ ధాటిగా ఆడుతూ కేవలం 36 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఓపెనర్ రికెల్టన్ సెంచరీ చేసి 103 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.

నిర్ణీత 50 ఓవర్లలో సౌత్ ఆఫ్రికా 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది.  ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నబి రెండు వికెట్లు తీయగా, ఫారూఖీ, ఓమర్జాయ్ నూర్ అహ్మద్ తల ఒక వికెట్ తీశారు