మార్చ్ 7 న,పెద్దోడు, చిన్నోడు మళ్ళీ వస్తున్నారు

by | Feb 21, 2025 | సినిమా

వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన మల్టీ స్టార్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు రీ రిలీజ్ ల ట్రెండ్ మొదలయ్యింది కదా. ఈ నేపథ్యంలో ఈ సూపర్ హిట్ మూవీ ని 12 సంవత్సరాల తరవాత మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని మార్చ్ 7 న మళ్ళీ థియేటర్ల లో రిలీజ్ చేస్తున్నారు.  ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు.

శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు