తల్లి తండ్రులు, పుట్టిన ఊరు : రేఖ గుప్తా 1974 జులై 19 నహర్యానాలో జన్మించారు. 1976 లో వీరి కుటుంబం ఢిల్లీ కి వచ్చింది. తల్లి పేరు ఊర్మిళ జిందాల్, తండ్రి పేరు జయ భగవాన్ జిందాల్. తండ్రి బ్యాంకు మేనేజర్. రేఖ గుప్తా గారి వాయలు 50 సంవత్సరాలు
చదువు : దౌలత్ రామ్ కళాశాలలో బి కామ్ చదివారు. చరణ్ సింగ్ యూనివర్సిటీ నుండి ఎల్ ఎల్ బి చేశారు
విద్యార్థి జీవితం : చదువుతున్న సమయంలో, అంటే 1992 లో ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాలలోకి అడుగు పెట్టారు. 1996-97 మధ్య లో ఢిల్లీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా చేశారు199
వివాహం : 1998 లో వ్యాపార వేత్త మనీష్ గుప్తా ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కొడుకు ఎంగినెఱింగి చదువుతున్నాడు. కూతురు మాస్టర్స్ చేస్తోంది.
రాజకీయ అరంగేట్రం : రాజకీయ నేపధ్యం ఏమి లేని కుటుంబం నుండి వచ్చారు. 2002 లో భాజపా లో చేరారు. 2007 లో పీఠంపుర కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పని చేశారు. రేఖ గుప్తా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మెంబర్ గా ఉన్నారు. భారతీయ మహిళా మోర్చా ఢిల్లీ జనరల్ సెక్రటరీ గాను, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గాను పని చేశారు
సేవ భావం : అనేక మంది వెనుకబడిన తరగతుల మహిళలకు ఆర్ధిక సాయం అందించడమే కాకుండా, వారి పిల్లల చదువులకు కూడా సాయం చేసేవారు
అసెంబ్లీ ఎన్నికల అనుభవం : షాలిమార్ బాగ్ స్థానం నుండి 2015 లో, 2020 లో పోటీ చేసినప్పుడు 11 వేలు, 3 వేల ఓట్ల తేడాతో ఆప్ పార్టీ కి చెందిన బందన కుమారి చేతిలో ఓడిపోయారు. అయితే మూడవ సారి అదే షాలిమార్ బాగ్ స్థానం నుండి పోటీ చేసి, అదే బందన కుమారి ని 30 వేల ఓట్ల తేడాతో ఓడించారు
రికార్డు : ఏం ఎల్ ఏ గా గెలిచిన మొదటి సారే ముఖ్యమంత్రి అయ్యారు రేఖ గుప్తా. ప్రస్తుత భాజపా పాలిత రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులలో ఏకైక మహిళా .
విద్యార్థి దశ నుండే రాజకీయాలు వంట పట్టించుకున్న రేఖ గుప్తా 2002 నుండి ఇప్పటివరకు అంటే, 22 సంవత్సరాలు వివిధ పదవులలో భాజపా పార్టీ కి సేవలనందించింది. నరేంద్ర మోడీ మార్క్ స్ట్రాటజీ తో అసెంబ్లీ ఎన్నికలలో మొదటి సారి గెలవగానే ముఖ్య మంత్రి పదవి ఆమెని వరించింది. మహిళా నేత, ఓబీసీ నేత కావడంతో అదృష్టం వరించింది.
ముఖ్యమంత్రి గా రేఖ గుప్తాని ఎన్నుకోవడం ద్వారా, భాజపాలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు అన్న నరేంద్ర మోడీ మార్క్ స్ట్రాటజీ ని ప్రజలలోకి బలంగా భాజపా తీసుకువెళ్లగలిగింది
ఢిల్లీ కి నాలుగవ మహిళా సీఎం రేఖ గుప్తా. గతంలో కాంగ్రెస్ కు చెందిన షీలా దీక్షిత్ మాత్రమే సుమారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పని చేశారు. భాజపా కి చెందిన సుష్మ స్వరాజ్, ఆప్ కు చెందిన ఆతిషి 50-60 రోజులు మాత్రమే ముఖ్య మంత్రి గా పని చేశారు
కీలక శాఖలైన ఫైనాన్స్, రెవిన్యూ శాఖలను ముఖ్యమంత్రి రేఖ గుప్తా తనవద్దనే ఉంచుకున్నారు. రేఖ గుప్తా గారి పరిపాలన ఎలా ఉంటుందో, ఆప్ ను ఎలా ధీటుగా ఎదుర్కొంటుంది అన్న విషయాలు ముందు ముందు తెలియాలి.
‘భాజపాలో ముఖ్యమంత్రి అభ్యర్థిని సీనియారిటీ ప్రకారం కాకుండా ఆ రాష్ట్ర పరిస్థితులను బట్టి, పార్టీ లక్ష్యాలను బట్టి ఎన్నుకుంటారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, జె పి నడ్డా ల నాయకత్వంలో ఎన్నుకుంటారు.

