ఛాంపియన్స్  ట్రోఫీ : భారత్, బంగ్లా మ్యాచ్ రికార్డు లు

by | Feb 21, 2025 | వార్తలు

  • అల్ రౌండర్ రవీంద్ర జడేజా కి ఇది 200 వ వన్ డే మ్యాచ్
  • స్టార్ పేసర్ మహ్మద్ షమీ వన్ డే ల్లో అత్యంత వేగంగా  200 వికెట్లు తీసుకున్న (104 వన్ డే లు)  భారత బౌలర్ గా రికార్డు సృష్టించాడు.  అంతకు ముందు అగార్కర్ 133 మ్యాచ్ ల్లో ఈఘనత సాధించాడు. అందరికన్నా వేగంగా 102 వన్ డే ల్లో 200 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌలర్ మిచెల్ స్టార్క్ (102 వన్ డే లు).  మ్యాచ్ లు పరంగా స్టార్క్ తక్కువ ఆడిన, వేసిన బంతుల పరంగా, స్టార్క్ కన్నా తక్కువ బంతులు వేసి 200 వికెట్లు తీసుకున్నాడు
  • ఐ సి సి ఈవెంట్ లలో అత్యధిక వికెట్ లు పడగొట్టిన భారత బౌలర్ షమీ (60 వికెట్లు).  అంతకు ముందు జహీర్ ఖాన్ (59 వికెట్లు ) పేరిట ఉండేది ఈ రికార్డు
  • వన్ డే ల్లో శుభమన్ గిల్ కి ఇది ఎనిమిదవ శతకం. చివర వరకు నిలిచి భారత్ కు రాహుల్ తో కలిసి ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్ లో విజయాన్ని అందించాడు
  • 14 నెలల విరామం తరవాత మైదానంలో  అడుగు పెట్టిన మొదటి మ్యాచ్ లో షమీ 5 వికెట్లు తీసుకున్నాడు
  • వన్ డే లో 11000  పరుగులు పూర్తి చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.  అత్యంత వేగంగా 11 వేల పరుగులు (261 ఇన్నింగ్స్) సాధించిన బ్యాట్స్ మన్ లలో రోహిత్ శర్మ రెండవ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 11 వేల పరుగులను 222 ఇన్నింగ్స్ లలో సాధించాడు.  మొత్తంగా 11 వేల పరుగులు చేసిన భారత నాలుగవ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ
  • 108 వన్డేలలో ఫ్రంట్ ఫుట్ నో బాల్ వేయని కుల్ దీప్ మొదటి సారి బంగ్లా తో మ్యాచ్ లో ఫ్రంట్ ఫుట్ నో బాల్ వేశాడు
  • ఇండియా పై, బంగ్లా దేశ్ కు ఆరవ వికెట్ కు జేకర్ అలీ, హృదోయ్ ,లు 154 పరుగుల అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు
  • 3 క్యాచ్ లు వదిలేసిన భారత ఫీల్డర్లు.  అక్షర్ పటేల్ బౌలింగ్ లో రోహిత్ శర్మ వదిలేసినా క్యాచ్ వాళ్ళ అక్షర్ పటేల్ కు హ్యాట్రిక్ తీసే అవకాశం పోయింది.  రోహిత్ హుందాగా అక్షర్ కు క్షమాపణలు చెప్పాడు.
  • 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఆట స్ఫూర్తిదాయకం
  • ఈ ఛాంపియన్స్ ట్రోఫీ లో రెండు మ్యాచ్ లలో నాలుగు సెంచరీ లు నమోదయ్యాయి. సెంచరీ వీరులు – టామ్ లేధం, విల్ యంగ్, హృదోయ్, శుభమన్ గిల్
https://twitter.com/ICC/status/1892647391095910436