టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా. ‘కింగ్డమ్’ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ దేవరకొండ సరికొత్త మేకోవర్‌తో గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఇందులో కనిపిస్తున్నారు. టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ నుండి ఇటీవలే విడుదలైన టీజర్ వరకు ప్రతీది సినిమాపై అంతకంతకు అంచనాలను పెంచుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.
అయితే ‘కింగ్డమ్’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ సినిమా
చిత్రీకరణ ఇప్పుడు తుది దశకి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా చివరి షూటింగ్ షెడ్యూల్ విశాఖపట్నంలో వేసిన ప్రత్యేక సెట్ లో ప్రారంభించారు. ఈ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ మార్చి మొదటి వారం వరకు జరగనుండగా.. ఈ షెడ్యూల్ తో సినిమా మొత్తం పూర్తి కానుందని సమాచారం. ఆ వెంటనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సమ్మర్ కానుకగా మే 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట మేకర్స్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

