విక్టరీ వెంకటేష్ (Venkatesh) కథానాయకుడిగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో దిల్‌రాజు (Dil Raju), శిరీష్ తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) బాక్సాఫీస్ బరిలో రికార్డు వసూళ్లతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మీనాక్షి చౌదరి, ఐశ్వర రాజేష్ నాయికలుగా నటించిన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది. సీనియర్ నటుడు నరేశ్, వీటీ గణేశ్, సాయి కుమార్, మురళీ, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందించారు. నాన్ స్టాప్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ గా నిలువడమే కాకుండా బాక్సఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది.
ఇదిలా ఉండగా, మేకర్స్ త్వరలోనే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ తో పాటుగా టీవీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5 Telugu) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జీ5 ఎక్స్ (ట్విట్టర్) లో ఒక పోస్ట్ చేసింది. ‘ఏమండోయ్ వాళ్లు వస్తున్నారు. మరిన్ని వివరాలు, కూసంత చమత్కారం కోసం వేచి చూడండి’ అంటూ జీ5 క్యాప్షన్ జత చేసింది. దీంతో మరికొన్ని రోజుల్లోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీలను జీ5 అధికారికంగా ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది.

