నేచురల్ స్టార్ నాని (Nani), దర్శకుడు శైలేశ్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్'(HIT): ది థర్డ్ కేస్’. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ అనే ఓ పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా నాని కనిపించనున్నారు. ఇప్పటి వరకు నాని పోషించిన పాత్రలతో పోల్చితే ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండనుందని మేకర్స్ చెబుతున్నారు. కాగా, వాల్‌పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఈ మూవీపై అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. తాజాగా సినిమా టీజర్‌కు సంబంధించిన అప్డేట్తో మేకర్స్ వచ్చారు. హిట్ 3 మూవీ టీజర్‌ను ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ టీజర్ పోస్టర్‌తోనే ఈ టీజర్‌పై అంచనాలను అమాంతం పెంచేశారు.
ఈ పోస్టర్ లో నాని తన చేతిలో గొడ్డలి పట్టుకొని ఉండగా.. తన కాళ్ల దగ్గర పడిపోయిన రౌడీలు పడిపోయి ఉన్నారు. ఈ పోస్టర్ సినిమాలో నాని పాత్ర ఎంత సాలిడ్ గా ఉండనుందో తెలియజేస్తోంది. కాగా, హిట్ ఫ్రాంచైజీలో భాగంగా ఇంతకుముందు యువ హీరోలు విష్వక్ సేన్ ‘హిట్’, అడివి శేష్ ‘హిట్ 2’లో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో ‘హిట్ 3’పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా వేసవి కానుకగా మే 1న విడుదల కానుంది.

