‘హరి హర వీరమల్లు’..డేట్ ఫిక్స్ చేసిన పవన్ ఫ్యాన్స్!

by | Feb 20, 2025 | సినిమా

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ తెరకెక్కుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో పవర్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవన్ అభిమానులను అలరించనున్నారు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

‘హరి హర వీరమల్లు’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో ఈ మూవీలోని రెండో సాంగ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ‘హరిహరవీరమల్లు’ చిత్ర యూనిట్ రెండో సాంగ్ పై అప్ డేట్ ఇచ్చారు. ఈ మూవీ లోని ‘కొల్లగొట్టిందిరో..’ అంటూ సాగే సెకండ్ సాంగ్ ను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ ఛాయిస్ ని పవర్ స్టార్ అభిమానులకే వదిలేశారు మేకర్స్. ‘కొల్లగొట్టిందిరో..’ సాంగ్ ప్రోమోని ఫిబ్రవరి 21, 22 తేదీలలో ఎప్పుడు రిలీజ్ చేయాలో చెప్పాలంటూ ఎక్స్ (ట్విట్టర్) లో పోల్ పెట్టారు. అయితే ఈ పోల్ లో ఎక్కువ మంది ఈ నెల 21నే సాంగ్ ప్రోమో రిలీజ్ చేయాలంటూ ఓటింగ్ చేశారు. దాంతో ఈ సాంగ్ ప్రోమో ఈ నెల 21న రానుండగా… ఫుల్ సాంగ్ ఈ నెల 24న విడుదల కానుంది.

తాజా సమాచారం ప్రకారం క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం ‘గురు’ మూవీలోని సూపర్ హిట్ సాంగ్ ‘తేరే బినా’ మాదిరిగా ‘కొల్లగొట్టినాదిరో’ సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో పవన్‌ కల్యాణ్‌, నిధి అగర్వాల్‌ మీద ఈ సాంగ్ ను హైదరాబాద్ లోని ఓ ప్యాలెస్‌లో ఐదు రోజులపాటు చిత్రీకరించినట్లు సమాచారం. దాంతో విడుదలకు ముందే ‘కొల్లగొట్టినాదిరో’ సాంగ్ పై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది. కాగా, భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.