ఛాంపియన్స్ ట్రోఫీ రేపే ప్రారంభం, షెడ్యూల్ చూశారా?

by | Feb 18, 2025 | వార్తలు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రేపే ప్రారంభమవుతోంది. మొదటి మ్యాచ్ పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీలో జరుగుతుంది.  ఫిబ్రవరి 20 న భారత, బాంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

గతం లో ఛాంపియన్స్ ట్రోఫీ ని ఎవరెవరు గెలుచుకున్నారో చూద్దాం. మొదటి ఛాంపియన్స్ ట్రోఫీ 1998 లో సౌత్ ఆఫ్రికా గెలుచుకుంది. ఆ తరవాత 2000 లో న్యూజిలాండ్, 2002 లో భారత, శ్రీ లంక దేశాలు సంయుక్తం గా గులుచుకున్నాయి. 2004 లో వెస్ట్ ఇండీస్, 2006, 2009 లో ఆస్ట్రేలియా వరసగా రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ ని గెలుచుకుంది. 2013 లో ఇండియా గెలుచుకోగా, 2017 లో పాకిస్థాన్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ని గెలుచుకుంది.

ఆస్ట్రేలియా, భారత జట్లు మాత్రమే రెండు సార్లు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ని గెలుచుకున్నాయి.  అయితే, ఈ రెండింటిలో భారత్ ఒక సారి శ్రీలంకతో పంచుకోవాల్సి వచ్చింది.

ఎనిమిది దేశాలు పాల్గొనే ఈ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ లో  ప్రతి మ్యాచ్ గెలవడం చాలా అవసరం.  ఇలాంటి పెద్ద పెద్ద టోర్నమెంట్ లో ఏ జట్టును తక్కువ అంచనా వేయకూడదు.

ఏ గ్రూప్ లో ఏ జట్లు ఉన్నాయో చూద్దాం

గ్రూప్ ఎ  : ఇండియా, బాంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్

గ్రూప్ బి  : ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘానిస్తాన్

ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారం మధ్యాన్నం 2.30 నుండి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ లో చూడవచ్చు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ను చూడండి