ఐకాన్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. పుష్ప పార్ట్ 1 సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా టాలీవుడ్‌తో పాటు బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన 75 రోజుల్లో పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1871 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే గతేడాది బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ‘పుష్ప 2’ నిలిచింది. కేవలం హిందీలోనే రూ.900 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడం విశేషం. భారత చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో రూ.2024 కోట్లతో దంగల్ అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో రూ. 1871 కోట్లతో పుష్ప 2 నిలిచింది. ఈ జాబితాలో మూడో స్థానంలో రూ.1810 కోట్లతో బాహుబలి-2 ఉంది.
కాగా, పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్నా నటించగా.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్, అద్భుతమైన మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, రావు రమేష్, జగపతి బాబు, అజయ్, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు.

