‘హిట్‌ 3’: పవర్​ఫుల్ రోల్​లో అడవి శేష్

by | Feb 18, 2025 | సినిమా

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శైలేశ్‌ కొలను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్‌’: ది థర్డ్‌ కేస్‌’. క్రైమ్‌ థ్రిల్లర్​గా రూపొందనున్న ఈ చిత్రంలో అర్జున్‌ సర్కార్‌ అనే ఓ పవర్​ఫుల్ ఐపీఎస్‌ ఆఫీసర్​గా నాని కనిపించనున్నారు. వాల్‌పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఇంతకుముందు యువ హీరోలు విష్వక్‌ సేన్‌ ‘హిట్‌’, అడివి శేష్‌ ‘హిట్‌ 2’లో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో ‘హిట్​ 3’పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ‘హిట్‌ 3’ మూవీలో అడివి శేష్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. హిట్ 3 మూవీలో అడివి శేష్ కోసం దర్శకుడు శైలేష్ కొలను చాలా పవర్ ఫుల్ రోల్ సిద్ధం చేసినట్లు సమాచారం.

సినిమాలో అడివి శేష్ పాత్ర ఎంట్రీ ఇంటర్వెల్ ముందు ఉంటుందని, అడవి శేష్ పాత్ర హిట్ ఫ్రాంచైజీలో ప్రత్యేకంగా మిగిలిపోతుందని మేకర్స్ అంటున్నారు. దీంతో ఇప్పుడు హిట్3పై అంచ‌నాలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వేసవి కానుకగా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.