ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ఫర్ 2024 లో ప్రపంచంలోని అత్యుత్తమ బ్రాండ్ లలో రిలయన్స్ రెండవ స్థానం లో వచ్చింది. మల్టీ నేషనల్ కంపెనీ అయినా యాపిల్ ను మూడవ స్థానానికి పంపింది మన ఇండియన్ బ్రాండ్ రిలయన్స్.
దీర్ఘ కాలిక లక్ష్యాల్ని చేరుకోవడనికి కంపెనీ స్ట్రాటెజిని, మారుతున్న టెక్నాలజీ ని అందిపుచ్చుకోవడం, వినియోగదారుల అంచనాలకు తగ్గట్లు గా బ్రాండ్ లను అభివృద్ధి చేయడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ర్యాంకులను కేటాయిస్తారు.
అంతర్జాతీయంగా ఉన్న మొదట 100 కంపెనీలకు ఈ ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ రాంక్ లను ఇస్తుంది.
దక్షిణ కొరియా కి చెందినశాంసంగ్ అగ్ర స్థానంలో ఉంది. 2023 లో 13 వ స్థానంలో ఉన్న రిలయన్స్ 2024 లో రెండవ స్థానానికి వచ్చింది. ఈ జాబితాలో ఏడవ స్థానంలో ఉన్న వాల్ట్ డిస్నీకంపెనీ ఇండియా (స్టార్ ఇండియా) వ్యవరాహలకు సంబంధించి, ఇటీవలే రిలయన్స్ పెట్టుబడులు పెట్టింది.
ఈ టాప్ టెన్ లో, అమెరికా కు చెందిన నాలుగు కంపెనీ లు ఉన్నాయి. ఈ సారి ఈ జాబితాలో దిగ్గజ కంపెనీలు అయిన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్, యూనీలీవర్ చోటు దక్కకపోవడం విశేషం
టాప్ 10 అంతర్జాతీయ బ్రాండ్ లు ఇవే. టాప్ 10 ఇంటర్నేషనల్ కంపెనీ ల లోగోలను కూడా ఒకసారి పరిశీలించండి
| Rank | Company | Country |
| 1 | Samsung | South Korea |
| 2 | Reliance | India |
| 3 | Apple | America |
| 4 | Nike | America |
| 5 | ASML | Netherlands |
| 6 | Danaher Corporation | America |
| 7 | Walt Disney | America |
| 8 | Maotai | China |
| 9 | TSMC | Taiwan |
| 10 | IHC | UAE |

