అల్లు అర్జున్ – అట్లీ మూవీ ఫిక్స్.. హీరోయిన్​గా ఎవరంటే?

by | Feb 18, 2025 | సినిమా

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా పాత్రలో నటించిన సీక్వెల్‌ మూవీ పుష్ప 2 ది రూల్‌. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించింది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్, అద్భుతమైన సంగీతం అందించారు. అయితే ఈ సినిమా త‌ర్వాత అల్లు అర్జున్ తర్వాతి ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అల్లు అర్జున్ త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఇంకా స్క్రిప్ట్ పనులు పూర్తి చేయలేదని తెలుస్తోంది. దాంతో ఈ సినిమా కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని.. ఈ క్రమంలోనే ఈ సినిమాను పక్కన పెట్టిన అల్లు అర్జున్ తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేయనున్నాడని సమాచారం.

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో హై యాక్షన్‌ సినిమా తెరకెక్కించనున్నట్లు టాక్‌ నడుస్తుండగా.. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో బన్నీ ఓ కొత్త లుక్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండనుండగా.. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. కాగా, అంతకుముందు జాన్వీ కపూర్‌ టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు జోడీగా ‘దేవర’ సినిమాలో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో ‘పరమ సుందరి’ సిద్దార్థ్‌ మల్హోత్రాకు జోడీగా నటిస్తోంది.