శివకార్తికేయన్‌ కొత్త మూవీ.. ఆసక్తికరంగా టైటిల్ రివీల్ గ్లింప్స్

by | Feb 17, 2025 | సినిమా

మావీరన్‌, అయలాన్‌, అమరన్‌ చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్ కొట్టిన తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్‌. తన కెరీర్‌లో 23వ చిత్రాన్ని ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్న శివకార్తికేయన్‌ తన 40వ పుట్టినరోజు సోమవారం జరుపుకుంటున్నారు. స్ సందర్భంగా ఆయన కొత్త సినిమా టైటిల్‌ ప్రకటనతో పాటు అదిరిపోయే గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి మదరాసి అనే టైటిల్‌ను చిత్రబృందం ఫిక్స్‌ చేశారు.

తాజాగా విడుదలైన గ్లింప్స్ లో శివ‌కార్తికేయ‌న్ ఇంతకుముందు చూడ‌ని కొత్త లుక్ లో ఆదరగొట్టారు. సినిమాటోగ్రాఫ‌ర్ సుదీప్ ఎలామోన్ అందించిన విజువ‌ల్స్ కళ్ళుచేదిరే రీతిలో ఉండగా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ర‌విచంద్ర‌న్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ దాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. మొత్తంగా టైటిల్‌ గ్లింప్స్ తో చిత్ర బృందం మదరాసి సినిమాపై ఒక్కసారిగా అంచ‌నాలు పెంచేశారు.

కాగా, మదరాసి చిత్రంలో శివ కార్తికేయన్‌ పవర్‌పుల్‌ పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో నగించనుండగా.. కన్నడ భామ రుక్మిణివసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బిజూ మీనన్ విద్యుత్ జుంజున్ వాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు అత్యంత భారీ బడ్జెట్ పై శ్రీ లక్ష్మి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.