ప్రశాంత్‌నీల్‌-ఎన్టీఆర్‌ మూవీ.. సెట్స్‌లోకి యంగ్‌ టైగర్‌

by | Feb 17, 2025 | సినిమా

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం జోరుమీదున్న సంగతి తెలిసిందే. గతేడాది దేవ‌ర మూవీతో ఎన్టీఆర్ సూపర్ హిట్ అందుకున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. అయితే ఈ సినిమ తరువాత క‌న్న‌డ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్‌, స‌లార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయ‌బోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పక్కా యాక్షన్ బ్యాక్​డ్రాప్​తో రానున్న ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్​ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ వచ్చే వారం నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఓల్డ్‌ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేయగా.. ఈ తొలి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ లేకుండా కొన్ని కీలక సన్నివేశాల్ని షూట్ చేయనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ మూవీ రెండో షెడ్యూల్ కూడా ఇదే సెట్స్ లో జరగనుండగా ఎన్టీఆర్ మార్చి సెకండ్ వీక్ లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. మలయాళ నటుడు టొవినో థామస్‌ కీలక పాత్ర పోషించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.