సునీత విలియమ్స్, విల్మోర్ గత జూన్ లో అంతరిక్షంలో కి వెళ్లారు. స్పేస్ క్రాఫ్ట్ టెస్ట్ చేసే నిమిత్తం, ఇది కేవలం ఎనిమిది రోజుల ఆపరేషన్. 8 రోజు లల్లో భూమి మీదకు తిరిగి రావాలి. అయితే హీలియం లీక్ అవడంతో పాటు, అనేక సాంకేతిక కారణాల వలన వీరి రాక ఆలస్యమయింది.
అయితే ఇప్పుడు, నాసా స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా సునీత విలియమ్స్ ను, విల్మోర్ ను మార్చ్ 2025 లో భూమి మీదకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తోంది.
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక, ఎలాన్ మస్క్ ను ఆస్ట్రోనాట్స్ ను ఎలాగైనా భూమి మీదకు తీసుకురావాలని కోరాడు. ఎలాన్ మాస్క్ సునీత విలియమ్స్, విల్మోర్ లను వెనక్కి తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ సహాయపడుతుంది అని చెప్పాడు. నాసా కూడా వారి ప్రయత్నాల్లో ఉంది
ప్రస్తుతం సునీత విలియమ్స్ ఆరోగ్యం పై అందరికి అనుమానాలు వస్తున్నాయి. సునీత విలియమ్స్ మేము బాగానే ఉన్నాము, సైంటిఫిక్ రీసెర్చ్ ను కొనసాగిస్తున్నామని చెపుతున్నారు.
అయినప్పటికీ ఈ మధ్య , బయటకు వచ్చిన ఫోటోలు చూస్తే, ఆమె చాలా చిక్కిపోయారని అనిపిస్తోంది. అయితే ఇదంతా మైక్రో గ్రావిటీ ప్రభావం అని చెపుతున్నారు. అక్కడ శారీరక శక్తి కోసం వ్యాయామాలు కూడా చేస్తున్నామని తెలిసింది
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఇన్ని రోజులు ఉండడం వలన, మరిన్ని పరిశోధనలకు అవకాశం లభించింది. సునీత విలియమ్స్, విల్మర్ ల పట్టుదలను అభినందించకుండా ఉండలేము. నాసా కూడా వారిని సేఫ్ గా భూమి మీదకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తోంది.
సునీత విలియమ్స్ గతంలో 2006-07 మధ్యలో 196 రోజులో స్పేస్ లో ఉన్నారు. ఆ తర్వాత 2012 లో 127 రోజులు ఉన్నారు
సునీత విలియమ్స్, విల్మోర్ లు భూమి మీదకు వచ్చే నాటికి 250-300 రోజులు పట్టవచ్చు. అయితే గతం లో 300 రోజులకు పైగా స్పేస్ లో ఉన్నవాళ్లు ఉన్నారు
అయితే, అందరు అనుకున్నట్టుగా , ఐ ఎస్ ఎస్ లో పూర్తిగా జీరో గ్రావిటీ ఉండదు, మైక్రో గ్రావిటీ ప్రభావం ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి కి దూరం గా సుమారు 10 నెలల పాటు ఉండడం వలన, భూమి మీదకు వచ్చాక ఆరోగ్య సమస్యల తలెత్తే అవకాశాలు లేకపోలేవు.


