ఒకే రోజు, ఈ నెల 21న, 5 సినిమాలు విడుదలవుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
రిటర్న్ అఫ్ ది డ్రాగన్
ప్రదీప్ రంగనాథన్ నటించిన మరో లవ్, రొమాంటిక్ సినిమా రిటర్న్ అఫ్ ది డ్రాగన్. అనుపమ పరమేశ్వరన్ కధానాయిక. అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ రిటర్న్ అఫ్ ది డ్రాగన్ సినిమా ఈ నెల 21 న తెలుగు, తమిళ బాషలలో విడుదలవుతోంది. లవ్ టుడే సినిమా తో, ప్రదీప్ రంగనాథన్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. యూత్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడే ఈ సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి
జాబిలమ్మ నీకు అంత కోపమా
తమిళ నటుడు ధనుష్ ధనుష్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా త్రిపాత్రాభినయం చేస్తున్నారు. మెగా ఫోన్ చేత పట్టి దర్శకుడుగా రాయన్ సినిమా తో తన విశ్వరూపం చూపించాడు. రాయన్ సినిమా సూపర్ హిట్ అవడంతో, జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ చివరలో ధనుష్ డైలాగులు సినిమా పై ఆసక్తిని పెంచాయి
పవిష్, సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, థామస్ లు ఈ చిత్రంలో ప్రధాన పత్రాలు పోషించారు
ధనుష్ నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రం ఈ నెల 21 న తెలుగు, తమిళ బాషలలో విడుదలవుతోంది. యూత్ ఆడియన్స్ ని, ఫామిలీ ఆడియన్స్ కనెక్ట్ చేస్తూ ధనుష్ ఈ సినిమాని తీశారు
బాపు
బ్రహ్మాజీ, ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాల కృష్ణ లు నటించిన సినిమా ‘బాపు’. ఈ సినిమా కూడా ఈ నెల 21 న విడుదలవుతోంది. ఈ సినిమా టాగ్ లైన్ ఏంటో తెలుసా ‘ఏ ఫాథర్స్ స్టోరీ ‘
రాజు, భాను ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు దయ. పల్లెటూళ్లలో బంధాలు, అనుబంధాల విలువల గురించి చెప్పే చిత్రంలా ఉంది
రామం రాఘవం
కమెడియన్ ధన్ రాజ్ మొదటి సారిగా మెగా ఫోన్ చేత బట్టాడు. బలగం తో వేణు సూపర్ హిట్ ఇచ్చాడు. అదే కోవలో జబర్దస్త్ కమెడియన్ ధన్ రాజ్ తాను నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘రామం రాఘవం’.
తండ్రి, కొడుకుల మధ్య సంబంధాలను ఈ చిత్రంలో చూపిస్తున్నారని తెలుస్తోంది. సముద్రఖని, ధన్ రాజ్ ఈ చిత్రంలో తండ్రి, కొడుకులుగా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ఈ నెల 21 న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది
డాకు మహారాజ్
అదేంటి డాకు మహారాజ్ సంక్రాంతికి విడుదలయ్యింది కదా అనుకుంటున్నారు. అవునండి. అయితే ఈ నెల 21 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవబోతోంది. బాల కృష్ణ సినిమాలను, ముఖ్యం గా ఫామిలీ ఆడియన్స్ థియేటర్ లో కాకుండా ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ లో, టెలివిజన్ లో చూడడానికి ఇష్టపడతారు.

