‘డాకు మహారాజ్‌’ ఓటీటీ సర్‌ప్రైజ్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే ?

by | Feb 16, 2025 | సినిమా

నటసింహం నంద‌మూరి బాలయ్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తాజా సినిమా ‘డాకు మహారాజ్‌’. ఈ చిత్రానికి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. సితార బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రముఖ దర్శకుడు తమన్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ మూవీలో ప్రజ్ఞా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్‌లో అలరించారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ముఖ్య పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా భారీ విజయం దక్కించుకుంది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే భారీ స్థాయిలో వసూళ్లు సాదించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది.

ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో డాకు మహారాజ్ సినిమా ఫిబ్ర‌వ‌రి 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. అన‌గ‌న‌గా ఒక రాజు.. చెడ్డ‌వాళ్లంద‌రూ డాకు అనేవాళ్లు.. కానీ మాకు మాత్రం మహారాజ్.. డాకు మహారాజ్ సినిమాను ఫిబ్ర‌వ‌రి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో చూసి ఆనందించండి అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. మరోవైపు వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న బాలయ్య ప్రస్తుతం బోయపాటితో ‘అఖండ-తాండవం’ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దసరాకు ఈ సినిమా విడుదల కానుంది.