‘ఫౌజీ’లో యువరాణిగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బ్యూటీ

by | Feb 16, 2025 | సినిమా

సలార్, కల్కి సినిమాల విజయాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ జోష్ మీదున్నారు. ఇదే జోరును కొనసాగిస్తూ.. ప్రభాస్ వరుసగా సినిమాలు తీస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ‘సీతా రామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌ శివార్లలోని ఓ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో జరుగుతోంది. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వీ అనే యంగ్​ బ్యూటీ నటిస్తోంది. ఇప్పటికైతే ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

ఇదిలాఉంటే.. ‘ఫౌజీ’ సినిమాలో బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ ఆలియా భట్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారని సమాచారం. పీరియాడికల్‌ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆలియా భట్ ఓ యువరాణి పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం ఇటీవలే మేకర్స్ ఆలియాను సంప్రదించగా వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అంతకుముందు దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో రామ్‌చరణ్‌ సరసన ఆలియా భట్‌ నటించిన సంగతి తెలిసిందే.

కాగా,’ఫౌజీ’ సినిమాలో ప్రభాస్​తో పాటు మిథున్‌ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్‌ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది.