మెగాస్టార్​తో మెగాడాటర్ స్క్రీన్ షేరింగ్.. ‘విశ్వంభర’లో గెస్ట్​ రోల్!

by | Feb 16, 2025 | సినిమా

అగ్ర కథానాయకుడు చిరంజీవి హీరోగా రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ప్ర‌స్తుతం చిరంజీవిపై ఇంట్రో సాంగ్ షూట్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్ల‌డించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటో కాదు, చిరు తమ్ముడు మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల ఈ సినిమాలో భాగమైనట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇందులో నిహారిక గెస్ట్​ రోల్​లో నటిస్తున్నట్లు​ తెలుస్తోంది.

ఇప్పటికే చిరంజీవి మేనల్లుడు సాయ‌దుర్గా తేజ్‌ ఈ మూవీలో కనిపించనున్నారని సమాచారం. ఇప్ప‌టికే సాయిదుర్గా తేజ్ షూటింగ్‌లో కూడా పాల్గోన్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్​కు ట్రిపుల్ ట్రీట్ అన్నట్లే. కాగా, సోషియో ఫాంటసీ జానర్​లో ‘విశ్వంభర’ మూవీ రూపొందుతుంది. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘అంజి’ తర్వాత మెగాస్టార్ నుంచి ఈ జానర్​లో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష కథానాయికగా నటిస్తోంది. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కునాల్ కపూర్, అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.