అల్లు అర్జున్ ,త్రివిక్రమ్ మూవీ.. క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన సముద్రఖని

by | Feb 16, 2025 | సినిమా

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ టైటిల్‌ పాత్రలో నటించిన సీక్వెల్‌ మూవీ పుష్ప 2 ది రూల్‌. సీనియర్ దర్శకుడు సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించింది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సీక్వెల్‌కు దేవీ శ్రీ ప్రసాద్, అద్భుతమైన మ్యూజిక్‌ అందించారు. అయితే ఈ సినిమా త‌ర్వాత అల్లు అర్జున్ తర్వాతి ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అల్లు అర్జున్ త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్లు సమాచారం.

ఇక త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాను హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ, నాగవంశీ నిర్మించనున్నారు.బిఅయితే ప్రాజెక్ట్‌కు సంబంధించి త‌మిళ న‌టుడు సముద్ర‌ఖ‌ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమాకు సంబంధించి మా బ్రదర్ త్రివిక్రమ్ నాకు మెసేజ్ చేశాడు. ఈ సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని చెప్పాడు. మరికొన్ని రోజుల్లోనే అన్ని వివరాల‌ను చిత్ర‌ యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది అని సముద్ర‌ఖ‌ని పేర్కొన్నాడు. కాగా, అల్లు అర్జున్‌తో సినిమా కోసం త్రివిక్రమ్‌ సోషల్‌ మైథలాజికల్‌ ఫ్యాంటసీ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. పరమేశ్వరుడి కుమారుడైన కార్తికేయుడి కథ ఏంటి అనే కథాంశంతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.