టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ మెగా అభిమానుల్లో తెగ ఆసక్తి పెంచింది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ‘విశ్వంభర’ మూవీలో మెగా మేనల్లుడు సాయిదుర్గా తేజ్ నటించనున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో తేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్ లో చిరంజీవి, సాయిదుర్గా తేజ్ మీద కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి మీద శోభి మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేస్తుండగా… ఆ సాంగ్ లో చిరంజీవి, సాయిదుర్గా తేజ్ కలిసి స్టెప్పులేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ అని చెప్పొచ్చు.
కాగా, మెగా మేనల్లుడు సాయిదుర్గా తేజ్ ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘బ్రో’ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. కాగా, ‘విశ్వంభర’లో చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. ఇషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ సంగీతం అందిస్తుండగా.. దాదాపు రూ .200 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

