ఉమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) లో భాగంగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్యలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్ లలో 164 పరుగులకు అల్ అవుట్ అయ్యింది
నాట్ శివర్ బ్రాంట్ 59 బంతుల్లో 80 పరుగులు చేసి అజేయం గా నిలిచింది. కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ సింగ్ 22 బంతుల్లో 42 పరుగులు చేసింది. యాస్తికా భాటియా 11 పరుగులు చేయగా. ఓపెనర్ హీలీ డక్ అవుట్ అయ్యారు, మిగతా ఏ ఒక్క బ్యాట్స్ విమెన్ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల లో సదర్లాండ్ 3 వికెట్లు తీయగా, శిఖా పాండే 2 వికెట్లు తీసింది. క్యాప్సి, మని చెరో ఒక వికెట్ తీశారు. ముగ్గురు రన్ అవుట్ అయ్యి వేణు తిరిగారు
అనంతరం 165 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ కు షెఫాలీ వర్మ అదిరి పోయే ఆరంభాన్నీ ఇచ్చారు. షెఫాలీ వర్మ కేవలం 18 బంతుల్లో 43 పరుగులు చేసింది
ఆ తరవాత కీలక సమయంలో నికి ప్రసాద్ 33 బంతుల్లో 35 పరుగులు చేసింది. ఏ ఒక్కరు భారీ స్కోర్ చేయకపోయినా, సమిష్టిగా ఆడి తమ జట్టును (ఢిల్లీ క్యాపిటల్స్) గెలిపించారు. ఢిల్లీ క్యాపిటల్స్ సరిగా 20 ఓవర్ల లో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
ముంబై ఇండియన్స్ బౌలర్ లలో కెర్, హీలి రెండేసి వికెట్లు తీయగా, సంజన, బ్రాంట్, ఇస్మాయిల్ తలా ఒక వికెట్ తీశారు
కీలక సమయంలో 35 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన నికి ప్రసాద్ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది

