నటసింహం బాలయ్య సినిమా అంతే చాలు మనకు ముందుగా గుర్తొచ్చే పేరు మ్యూజిక్ డైరెక్టర్ తమనే. వీరిద్దరి కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది. డిక్టేటర్’, ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి , ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ చిత్రాలకు తమన్ మ్యూజిక్ అందించారు. ముఖ్యంగా అఖండ సినిమాకు తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. గూస్బంప్స్ వచ్చేలా తమన్ నేపథ్య సంగీతం అందించారు. ప్రతిసారి తన మ్యూజిక్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. నందమూరి అభిమానులైతే తమన్‌ను ఎస్ఎస్ తమన్ అని కాకుండా నందమూరి తమన్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే తమన్‌కు బాలయ్య భారీ సర్ప్రైజ్ ఇచ్చారు. తమన్ ప్రతిభను అభినందిస్తూ అతడికి విలువైన బహుమతి ఇచ్చారు. తాజాగా రూ.1.75 కోట్ల విలువ చేసే ఖరీదైన పోర్షే కారుని బాలయ్య స్వయంగా కొని, రిజిస్ట్రేషన్ చేయించి మరీ తమన్ కు కానుకగా ఇచ్చాడు. కెరీర్ పరంగా మరెన్నో విజయాలు అందుకోవాలని ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే, మరోవైపు బాలయ్య-తమన్ కాంబోలో అఖండ 2 సినిమా రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, అంతకుముందు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నారా భువనేశ్వరి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మొదటగా ఎన్.తమన్ అని తర్వాత సారీ నందమూరి తమన్ అంటూ నారా భువనేశ్వరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు విని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ముసిముసిగా నవ్వుకున్నారు.

