‘అఖండ 2’: బాలయ్య ‘అఘోరా’ లుక్‌ రివీల్ చేశాడుగా!

by | Feb 15, 2025 | సినిమా

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అఖండ 2 . తాండవం’. వీరిద్దరి కాంబోలో వచ్చిన మునుపటి బ్లాక్ బస్టర్ చిత్రం ‘అఖండ’కు ఇది సీక్వెల్. ‘అఖండ’ను మించేలా ‘అఖండ 2: తాండవం’ను తెరకెక్కిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందనుంది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ తో పాటుగా యంగ్ హీరో, విలక్షణ యాక్టర్ ఆది పినిశెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటించనునన్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా ఈ సినిమాకలో బాలయ్య పోషించిన అఘోరా లుక్ ఇప్పుడు బయటకి వచ్చేసింది. నలుపు రంగు కాస్ట్యూమ్స్ లో నుదుటన పెద్ద నామాలు, మెడలో రుద్రాక్ష మాల, మెలితిరిగిన మీసం కట్టుతో అఘోరా గెటప్ లో బాలయ్య ఉన్నారు. కాగా, అఖండ తొలి భాగాన్ని మించేలా అత్యంత పవర్ ఫుల్ గా ఈ క్యారక్టర్ ను డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 26న మహా శివరాత్రి కానుకగా అఖండ 2 లో బాలయ్య ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అంతకుముందే బాలయ్య లుక్ రివీల్ అయింది. కాగా, మరోసారి నటసింహాన్ని అఘోరా గెటప్ లో చూసిన నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. ఈ లుక్ లో బాలయ్య ఆదరగొడుతున్నారని మరోసారి అఖండ మాస్​ జాతర ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.