గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన గేమ్ ఛేంజర్ మూవీ 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశ పరిచింది. దాంతో ప్రస్తుతం అందరి దృష్టి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌సీ16 సినిమాపై ఉంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న RC16 సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. కుస్తీతో పాటు క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ సినిమా తరహాలోనే ఆర్‌సీ16 మూవీలోను ఒక థ్రిల్లింగ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండనుందని టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ డ్యూయెల్ రోల్‌లో నటించిన గేమ్ ఛేంజర్ మూవీ నిర్మాతకు భారీ నష్టాలు మిగిల్చినప్పటికీ.. ఇందులో చరణ్ నటనకు, ముఖ్యంగా మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆర్‌సీ16లోను డైరెక్టర్ బుచ్చిబాబు కూడా సాలిడ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇదే హైలైట్ గా నిలువనుందని టాక్ వినిపిస్తోంది. దింతో ఆర్‌సీ16 మేకర్స్ కూడా గేమ్ ఛేంజర్ సినిమా స్ట్రాటెజీని ఫాలో అవుతున్నట్లు స్పష్టమవుతుంది.

