చావా మూవీ రివ్యూ : Pride of Maratha

by | Feb 14, 2025 | సినిమా రివ్యూ

సినిమా                        : చావా

మార్కులు                   :  75/100

విడుదల తేదీ              : 14-02-2025

నిర్మాణ సంస్థ              : మద్దోక్ ఫిలిమ్స్

నటీ నటులు                : విక్కీ కౌశల్, అక్షయ్ ఖన్నా, రష్మిక మందాన

సంగీతం                      : ఏ ఆర్ రెహమాన్

నిర్మాత                        : దినేష్ విజన్

దర్శకత్వం                  : లక్ష్మణ్ ఉఁటేకర్

శివాజీ సావంత్ రాసిన చావా అనే నవల ఆధారం గా తీసిన చిత్రం ఈ చావా. మరాఠా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితమే ఈ చావా

డిసెంబర్ లో విడుదల అవ్వాల్సిన ఈ చావా సినిమా పుష్ప-2 కారణంగా వాయిదా వేశారు. ప్రపంచ వ్యాప్తం గా ఈ రోజు విడుదలైన చావా సినిమా ఎలా ఉంది చూద్దాం

కధ ఛత్రపతి శివాజీ మరణించిన తరవాత మరాఠా సామ్రాజ్యం ఒక్కసారిగా డీలా పడిపోతుంది.  ఇదే సరైన సమయం అని భావించిన  మొఘల్ చక్రవర్తి  ఔరంగజేబు ఎలాగైనా మరాఠా సామ్రాజాన్ని జయించాలని చూస్తాడు. అయితే మొఘల్ చక్రవర్తి  ఔరంగజేబుకు ఊహించని విధంగా ఛత్రపతి శంభాజీ మహారాజ్ నుండి ప్రతిఘటన వస్తుంది. అయితే ఛత్రపతి శంభాజీ మహారాజ్, ఔరంగజేబుని ఎలా ఎదుర్కొన్నాడు.  తన రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ చిత్రకథ

బలాలు 

  • ఛత్రపతి శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ ఆహార్యం, నటన అద్భుతంగా ఉన్నాయి.  ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలలో విక్కీ కౌశల్ నటన వేరే లెవెల్ లో ఉంటుంది
  • ఔరంగజేబు పాత్రకు అక్షయ్ ఖన్నా బాగా సరిపోయాడు.  నిజం గా ఇలా ఉండేవాడేమో అన్నట్లు నటించాడు
  • రష్మిక మందాన తాను ఎలాంటి పాత్రనైనా చేయగలనని మరోసారి నిరూపించుకుంది.  పుష్ప-2 లో పాత్రకు, ఈ పాత్రకు చాలా వ్యత్యాసం ఉంది.  మహారాణి పాత్రను అలవోకగా పోషించింది
  • ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం కొన్ని చోట్ల డల్ గా ఉన్న, మొత్తంగా నేపధ్య సంగీతం బాగానే ఉంది.  పాటలకు అవకాశం లేని సినిమా మొత్తం నేపధ్య సంగీతం మీదే ఉన్న సినిమా ఈ చావా
  • రిషి విర్మాని , ఇర్షాద్ కమిల్ సంభాషణలు చాలా బావున్నాయి.  దేశ భక్తిని పెంచేలా ఉన్నాయి
  • అజయ్ దేవగణ్ ఈ సినిమా కథని చెప్తుంటాడు. సౌరభ్ గోస్వామి కెమెరా పనితనం బావుంది
  • లక్ష్మణ్ ఉఁటేకర్ దర్శకత్వం

బలహీనతలు

  • ఇలాంటి చారిత్రాత్మక సినిమాలలో కొన్ని పరిమితులు ఉంటాయి దర్శకులకు. అయితే లక్ష్మణ్ ఉఁటేకర్ ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే ఇంకా ఎంగేజింగా ఉంటె బావుండేది
  • రెండవ భాగంలో, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొనేటపుడు, ప్రదర్శించే యుద్ధ విద్యలను మరింత బాగా తీసుంటే సినిమా వేరే స్థాయికి వెళ్ళేది
  • ఎమోషనల్ సన్నివేశాలను ఇంకా కొంచెం బలంగా రాసి ఉంటె బావుండేది.
  • విక్కీ కౌశల్, అక్షయ్ ఖన్నా, రష్మిక మందాన – ఈ మూడు పాత్రల చుట్టూ ప్రధానంగా సినిమా నడవడం.

హిస్టారికల్ యాక్షన్ డ్రామా సినిమా ‘చావా’ ని అందరు ఒకసారి చూడవచ్చు.  మహారాష్ట్ర లో మరాఠాలకు మాత్రం ఈ సినిమా బాగా నచ్చుతుంది.  విక్కీ కౌశల్, అక్షయ్ ఖన్నా, రష్మిక మందానల నటన కోసం అయినా అందరు చూడాలి

చివరగా చావా అందరిని మెప్పించే ఒక పిరియాడికల్ యాక్షన్ డ్రామాచే ఒక పిరియాడికల్ యాక్షన్ డ్రామా.