విశాఖ తీరంలో.. ‘కింగ్​డమ్​’ మూవీ క్రేజీ అప్​డేట్

by | Feb 14, 2025 | సినిమా

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కథానాయకుడుగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కింగ్​డమ్​’. ఇందులో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍ గా నటిస్తోండగా.. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా, అభిమానుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. విజయ్‌ దేవరకొండ సరికొత్త మేకోవర్‌తో గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపించారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.

తాజా సమాచారం ప్రకారం కింగ్​డమ్​ మూవీ చివరి షెడ్యూల్‌ను విశాఖపట్నంలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్ లో చిత్రీకరించేందుకు చిత్రబృందం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ తాజాగా వైజాగ్‌లో అడుగుపెట్టాడు. ఈ చివరి షెడ్యూల్‌తో ‘కింగ్​డమ్​’ మూవీ షూటింగ్ పూర్తి కానుందని మేకర్స్ చెబుతున్నారు. కాగా, ‘కింగ్​డమ్​’ సినిమాను తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. మే 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానుంది.