‘వార్‌-2’: హృతిక్‌ vs ఎన్టీఆర్.. డ్యాన్స్‌తో అదరగొట్టేదెవరు.?

by | Feb 14, 2025 | రాజకీయాలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘వార్‌ 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ రోషన్‌తో కలిసి ఆయన నటిస్తున్న ఈ సినిమాకి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. భారీ బడ్జెట్ తో యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. స్పై జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ షేర్ చేసిన వార్‌ 2 గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేసింది.

అయితే, ఇటీవల ‘వార్-2’ మూవీ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తి చేసుకోగా.. తాజాగా హీరోలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య డ్యాన్స్ కాంపిటీషన్ ను తలపించేలా సాంగ్ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మూవీ లవర్స్‌, అభిమానులకు థ్రిల్లింగ్ ట్విస్ట్‌ ఇచ్చేలా ఈ సినిమాలోని ఓ సాంగ్ కు వీరిద్దరూ స్టెప్పులు వేయనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి నెలాఖరున ఈ సాంగ్ షూటింగ్ జరగబోతుందని బి టౌన్ లో టాక్ నడుస్తోంది. నిజానికి డ్యాన్స్‌లో అటు హృతిక్ రోషన్, ఇటు ఎన్టీఆర్ ఇద్దరికీ సేపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రమంలో వీరిద్దరిలో ఎవరు బెస్ట్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తారో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా, భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న వార్‌ 2 మూవీని 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.