గెట్ రెడీ ఫ్యాన్స్‌.. ‘హరిహరవీరమల్లు’పై ఎక్జయిటింగ్‌ న్యూస్‌

by | Feb 14, 2025 | సినిమా

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇస్మార్ట్‌ భామ నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్‌ కల్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో కొనసాగుతూనే మరోవైపు హరిహరవీరమల్లుతోపాటు మిగిలిన సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజాగా హరిహరవీరమల్లు మేకర్స్ నుంచి అదిరిపోయే వార్త బయటకు వచ్చింది.

‘హరి హర వీరమల్లు’ సినిమా నుంచి ఇప్పటికే వచిన్న మొదటి సాంగ్ అభిమానుల్ని ఎంతగానో అలరించింది. ఈ క్రమంలోనే ఈ మూవీలో రెండో సాంగ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సెకండ్ సాంగ్ రిలీజ్ పై వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ రోజు అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఈ రెండో సాంగ్ పై చిత్ర యూనిట్ ఈ రోజు స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ట్వీట్ చేయడంతో అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది.

కాగా, ఎంఎం కీర‌వాణి మ్యూజిక్‌ అందిస్తున్న ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం మార్చి 28న విడుదల కానుంది.