టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘VD12’. ఇందులో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోండగా.. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు చిత్రబృందం. ‘VD12’ టైటిల్ రివీల్ చేయడంతో పాటు టీజర్ విడుదల చేశారు. ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీకి ‘కింగ్డమ్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.
అయితే ఈ సినిమా తెలుగు టీజర్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పగా.. హిందీ టీజర్‌కు టాప్ హీరో రణ్‌బీర్ కపూర్ తమిళంలో సీనియర్ హీరో సూర్య వాయిస్ ఇచ్చారు. అలసట లేని భీకర యుద్ధం.. అంటూ సాగే 1.56 నిమిషాల నిడివి ఉన్న తెలుగు టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పవర్ ప్యాక్డ్ వాయిస్ ఓవర్ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది. ముఖ్యంగా టీజర్ లో విజయ్ పాత్రను దర్శకుడు చూపించిన తీరు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ టీజర్ ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కాగా, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

