భారత ,ఇంగ్లాండ్ జట్ల మధ్య మధ్య జరుగుతోన్న మూడవ, ఆఖరి వన్ డే లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 356 పరుగులకు అల్ అవుట్ అయ్యింది
గత మ్యాచ్ లో సూపర్ సెంచరీ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఒక పరుగు చేసి అవుట్ అయ్యాడు.
వైస్ కెప్టెన్ శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ రెండవ వికెట్ కు 116 పరుగులు జోడించిన తరవాత, విరాట్ కోహ్లీ 52 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు
ఆ తరవాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్, గిల్ మూడవ వికెట్ కు 104 పర్గులులు జోడించారు. అయితే గిల్ సెంచరీ చేసి 112 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు
ఆ తరవాత కొద్దీ సేపటికే శ్రేయాస్ అయ్యర్ 78 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రాహుల్ 29 బంతుల్లో 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
పాండ్య 17 పరుగులు, అక్షర్ పటేల్ 13 పరుగులు,సుందర్ 14 పరుగులు, హర్షిత్ రానా 13 పరుగులు చేశాడు.
ఇంగ్లాండ్ బౌలర్లలో స్పిన్నర్ రషీద్ 4 వికెట్లు తీయగా, వుడ్ 2 వికెట్లు తీయగా, రూట్, అట్కిన్సన్, మహమూద్ తలా ఒక వికెట్ తీశారు

