టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘VD 12’. విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోండగా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్య్టూన్ ఫోర్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది. ‘VD 12’ మూవీకి సంబంధించిన టైటిల్ తో పాటుగా టీజర్ ను నేడు ప్రేక్షకుల ముందుకు తెలుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ‘VD 12’ చిత్రానికి తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, హిందీలో చాక్లెట్ బాయ్ రణ్ బీర్, తమిళ్ లో స్టార్ హీరో సూర్య వాయిస్ ఓవర్ ఇస్తుండటంతో ఈ టీజర్ ఎలా ఉండబోతుందా అని దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ‘VD 12’ టైటిల్ టీజర్ ను ఎప్పుడో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సంగీత దర్శకుడు అనిరుధ్ డేట్స్ లేనందున ఈ మూవీ ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా నుంచి టీజర్ రాబోతున్నందుకు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

