గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘RC 16’ మూవీ చిత్రీకరణతో
బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా తొలిసారిగా రామ్ చరణ్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ భారీ బడ్జెట్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే సెట్స్‌లోకి వెళ్లిన ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
అయితే ఈ సినిమా నుండి సాలీడ్ అప్డేట్ ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. స్పోర్ట్స్ బ్యాగ్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “పెద్ది” అనే టైటిల్ పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం “పవర్ క్రికెట్” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథలో భాగంగా ఫస్టాఫ్ మొత్తం క్రికెట్ నేపథ్యంలో సాగనుండగా.. సెకండాఫ్ కుస్తీ నేపథ్యంలో ఉండనుందంట. ఈ క్రమంలోనే రెండు ఆటలు కలిసొచ్చేలా “పవర్ క్రికెట్” అనే పవర్ ఫుల్ వర్కింగ్ టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలై నాటికి పూర్తి చేసి ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జగపతిబాబు, శివ రాజ్‌కుమార్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీత స్వరాలు సమకూరుస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

