రామ్ గోపాల్ వర్మకు షాక్ ల మీద షాక్ లు

by | Feb 7, 2025 | వార్తలు

రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య తాను మారిపోతున్నాను ఇకపై మంచి సినిమాలు తీస్తాను అని ప్రకటించినప్పటి నుండి రామ్ గోపాల్ వర్మ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల ఫోటో మార్ఫింగ్ కేసు కు సంబంధించి పోలీసులు 50 ప్రశ్నలు సంధించారు.  సుమారు 9 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది.  భయం అంటే ఏంటో తెలియని రామ్ గోపాల్ వర్మ కు పోలీసులు చెమటలు పట్టిస్తున్నారు. అంతే కాదు, వైస్సార్సీపీ నాయకులతో గల సంబంధాలపై ఆరా తీస్తున్నారు

ఈ విచారణ పూర్తి కాగానే గుంటూరు సి ఐ డి విచారణ హాజరు కావాలని నోటీసు లు ఇచ్చింది.  అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు అనే సినిమా కు సంబంధించిన కేసులో ఈ నోటీసు లు ఇచ్చారు. ఇది ఇలా ఉండగా, అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాలని ఒంగోలు పోలీస్ లు చెప్పారు

పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పడమంటే ఇష్ట రాజ్యంగా ఎక్స్ లో పోస్ట్ లు పెట్టడం కాదని రామ్ గోపాల్ వర్మ కు ఇప్పుడు తెలిసొచ్చిఉంటుంది ప్రస్తుతం టి డి పి అధికారం లో ఉంది.  కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయి