ఇంగ్లాండ్ తో వన్ డే : భారత లక్ష్యం 249 పరుగులు

by | Feb 6, 2025 | వార్తలు

భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాగపూర్ లో జరుగుతోన్న మొదటి వన్ డే లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది 

ఇంగ్లాండ్ 47.4 ఓవర్ లలో 248 పరుగులకు అల్ అవుట్ అయ్యింది

ఓపెనర్ లు ఫీల్ సాల్ట్, డకెట్ ధాటిగా ఆడుతూ మొదటి వికెట్ కు 75 జోడించారు. అయితే సాల్ట్ రన్ అవుట్ తో పరిస్థితి మారిపోయింది.  సాల్ట్ 26 బంతుల్లో 43 పరుగులు చేశాడు.  డకెట్ 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

బ్రూక్ తన పూర్ ఫామ్  ని కొనసాగిస్తూ డక్ అవుట్ అయ్యాడు. రూట్ 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

కెప్టెన్ బట్లర్ 52 పరుగులు, బెథెల్ 51 పరుగులు చేసి అవుట్ అయ్యారు.

భారత బౌలర్లలో హర్షిత్ రానా మెరిశాడు. టి 20 డెబ్యూ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసిన హర్షిత్ రానా, వన్ డే డెబ్యూ మ్యాచ్ లో కూడా మూడు వికెట్ లు తీశాడు. ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. అయితే ధారాళంగా పరుగులు ఇచ్చారు.  ఒక ఓవర్ లో సాల్ట్ 26 పరుగులు పిండుకున్నాడు

జడేజా తొమ్మిది  ఓవర్ లు బౌల్ చేసి ఒక మేడిన్ తో కేవలం 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.  అక్షర్ పటేల్, కుల్దీప్ లు తలా ఒక వికెట్ తీశారు.