భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాగపూర్ లో జరుగుతోన్న మొదటి వన్ డే లో భారత జట్టు ఇంగ్లాండ్ పై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఆడలేదు
249 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 2 పరుగులకు అవుట్ అవ్వగా, జైస్వాల్ 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
ఆ తరవాత బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్, శుభమన్ గిల్ మూడవ వికెట్ కు 94 పరుగులు జోడించారు. శ్రేయాస్ అయ్యర్ 36 బంతుల్లో 59 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన అల్ రౌండర్ అక్షర్ పటేల్ కూడా 52 పరుగులతో రాణించాడు.
వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ బాధ్యతతో చివర వరకు నిలబడి జట్టును గెలిపించాడు. 87 పరుగులు చేసిన శుభమన్ గిల్, లక్ష్యానికి 14 పరుగులు కావలసి ఉండగా అవుట్ అయ్యాడు
హార్దిక్ పాండ్య (9) , జడేజా (12) మరో వికెట్ పడకుండా లాంఛనాన్ని పూర్తి చేశారు
ఇంగ్లాండ్ బౌలర్లలో మహమూద్, రషీద్ రెండేసి వికెట్లు తీయగా, ఆర్చర్, బెథెల్ లు చెరో వికెట్ తీశారు
అంతకు ముందు ఇంగ్లాండ్, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ 47.4 ఓవర్ లలో 248 పరుగులకు అల్ అవుట్ అయ్యింది
ఓపెనర్ లు ఫీల్ సాల్ట్, డకెట్ ధాటిగా ఆడుతూ మొదటి వికెట్ కు 75 జోడించారు. అయితే సాల్ట్ రన్ అవుట్ తో పరిస్థితి మారిపోయింది. సాల్ట్ 26 బంతుల్లో 43 పరుగులు చేశాడు. డకెట్ 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
బ్రూక్ తన పూర్ ఫామ్ ని కొనసాగిస్తూ డక్ అవుట్ అయ్యాడు. రూట్ 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ బట్లర్ 52 పరుగులు, బెథెల్ 51 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
భారత బౌలర్లలో హర్షిత్ రానా మెరిశాడు. టి 20 డెబ్యూ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసిన హర్షిత్ రానా, వన్ డే డెబ్యూ మ్యాచ్ లో కూడా మూడు వికెట్ లు తీశాడు. ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. అయితే ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఒక ఓవర్ లో సాల్ట్ 26 పరుగులు పిండుకున్నాడు జడేజా తొమ్మిది ఓవర్ లు బౌల్ చేసి ఒక మేడిన్ తో కేవలం 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ లు తలా ఒక వికెట్ తీశారు


