బాల కృష్ణ డాకు మహారాజ్ ఓ టి టి లో ఈ రోజు నుంచే

by | Feb 6, 2025 | టీవీ & ఓటిటి

సంక్రాంతి కి విడుదలైన సినిమాలన్నీ ఒకదాని తరవాత ఒకటి ఓ టి టి లో కి వస్తున్నాయి.  ముందుగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్  వస్తోంది. ఈ నెల ఏడు నుండి (7th February) అంటే ఈ రాత్రి 12 గంటల నుండి అమెజాన్ లో స్ట్రీమ్ కాబోతోంది.

సంక్రాంతి కి వచ్చిన మరో సినిమా బాల కృష్ణ ‘డాకు మహారాజ్.  ఈ సినిమా 9th February నుండి నెట్ ఫ్లిక్ లో స్ట్రీమ్ కాబోతోంది.

సంక్రాంతికి వచ్చిన మరో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘సంక్రాంతి కి వస్తున్నాం’.  ఈ  సినిమా ప్రస్తుతం థియేటర్ లో ఇంకా జనాలు చూస్తున్నారు.  రేపు నాగ చైతన్య, సాయి పల్లవి ల తండేల్ రాబోతోంది. తండేల్ వచ్చిన తరవాత సంక్రాంతి కి వస్తున్నాం వసూళ్లు తగ్గే అవకాశం ఉంది.

మరో పది రోజుల్లో సంక్రాంతి వస్తున్నాం కూడా జీ 5 స్ట్రీమ్ కాబోతోంది.  ఇప్పటికే పుష్ప 2 నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ అవుతోంది

సంక్రాంతి కి వచ్చిన సినిమాలన్నీ ఎగ్జామ్స్ టైమ్ లో ఓ టి టి లో కి వస్తున్నాయి.