సిద్ధార్ధ్ ప్రధాన పాత్రలు శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ‘3 బీహెచ్ కే’. ఇందులో శరత్ కుమార్, దేవయాని, యోగి బాబు లు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ సినిమాను నిన్ననే టీజర్ ను లాంచ్ చేసి అధికారికంగా ప్రకటించారు
మధ్య తరగతి కుటుంబంలోని జీవితాల ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇది మా ఇంటి కధ. మా ఇల్లు చిన్న చిన్న మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉందని అంటున్నారు ఈ చిత్ర కధానాయకుడు సిద్ధార్ధ్
అమ్రిత్ రామినాధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. ఇది సిద్ధార్ధ్ 40 వ సినిమా. ఈ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు
ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ తో పాటు, టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

