కేంద్రం లో అధికారం లో ఉన్నా, 1998 తరవాత ఢిల్లీ అధికార పీఠాన్ని దక్కించుకోలేకపోయింది భాజపా. ఈ సారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని భాజపా సర్వ శక్తులు వడ్డీ పోరాడుతోంది.
ఈ రోజు ఢిల్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, రాహుల్ గాంధీ ఢిల్లీ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహాకుంభమేళాకు వెళుతున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానం లో నేరుగా ప్రయాగరాజ్ కు చేరుకుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ రోజు ఉదయం 11గంటలకు త్రివేణి సంగమంలో మోడీ స్నానమాచరించి ఆ తరవాత గంగా దేవి కి పూజలు చేస్తారు. ఢిల్లీ ఎన్నికల వేళ ఆ గంగమ్మ తల్లి ఆశీస్సుల కోసం మహాకుంభమేళా కు వస్తున్నారు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ. ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఈ నెల్ 8 న జరుగుతుంది

