సోను సూద్ చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, నటుడు సోను సూద్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ మేరకు ఎక్స్ లో చంద్రబాబు పోస్ట్ చేశారు
@SonuSood , మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది! @SoodFoundation ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు అంబులెన్స్‌లను ఉదారంగా విరాళంగా ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ చొరవతో ఆరోగ్య సంరక్షణ సేవలు మరింత బలోపేతమవుతాయి. అంతే కాకుండా మారుమూల ప్రాంతాలకు కూడా సమయానికి మెడికల్ కేర్ అందేలా తోడ్పడుతుంది. సమాజాలకు సేవ చేయడానికి మీరు చేసే గొప్ప ప్రయత్నాలలో మీరు నిరంతరం విజయం సాధించాలని కోరుకుంటున్నాను!
కరోనా సమయంలో అడిగిన వాళ్లకు అడిగినట్లు సహాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు సోను సూద్. ఈ మీటింగ్ కు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని అన్నారు. సమాజాన్ని ఏదైనా చేయాలన్న తపనతో ఇవన్నీ చేస్తున్నాని చెప్పారు

