టాప్ 10 న్యూస్

by | Jan 29, 2025 | వార్తలు

  • విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ నుండి 3rd సింగల్ జనవరి 31 న విడుదలవుతోంది.  లైలా మూవీ ఫిబ్రవరి 14 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.
  • విజయ్ ఆంటోనీ, శివ కార్తికేయన్ లు ఇద్దరు తమ కొత్త సినిమాల టైటిల్స్ ను ‘పరాశక్తి’ అని ప్రకటించారు. ఇద్దరు తమిళ హీరో ఒకే టైటిల్ ను గంటల వ్యవధిలో ప్రకటించడం విశేషం
  • చిరంజీవి తల్లి అంజనాదేవి గారి పుట్టిన రోజు సందర్భంగా ఉపాసన గారు బర్త్ డే విషెస్ ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.  చిరంజీవి ‘నీ పాదాలకి నమస్కరిస్తూ 🙏 పుణ్యం చేసుకొన్న నీ సంతతి❤️❤️❤️❤️❤️❤️’ అని పోస్ట్ చేశారు. కేక్ కట్ చేసిన వీడియో ని కూడా పోస్ట్ చేశారు
  • అండర్ 19 వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన భారత మహిళా బ్యాటర్ గొంగడి త్రిష కు మెగా స్టార్ చిరంజీవి తన విషెస్ తెలియచేశారు
  • మహా కుంభ మేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 కి చేరిన మృతుల సంఖ్య
  • శ్రీలంక తో జరుగుతున్న మొదటి టెస్టులో స్టీవ్ స్మిత్ 104 పరుగులు చేశాడు. టెస్టుల్లో స్టీవ్ స్మిత్ కు ఇది 35 వ శతకం. దీనితో సునీల్ గవాస్కర్ 34 సెంచరీలను అధికమించాడు. అంతే కాకుండా టెస్టుల్లో స్టీవ్ స్మిత్ 10000 ల పరుగులను పూర్తి చేసుకున్నాడు
  • ఫిబ్రవరి 10 లోగా, టూరిజం కొత్త పాలసీ ని తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు
  • అటవీ భూములను పెద్ది రెడ్డి ఆక్రమించారని వచ్చిన కథనాలపై చంద్ర బాబు స్పందించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు
  • ఆంధ్ర ప్రదేశ్ నూతన డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు ఈ నెల 31 రిటైర్ కానున్నారు
  • మూడవ టి 20 లో ఐదు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి, ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఏకంగా 25 స్థానాలకు ఎగబాకి టాప్ 5 లోకి వచ్చాడు