నిన్న మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయారు. 60మంది దాకా గాయపడ్డారు
కుంభమేళాలో తొక్కిసలాటలు ఇదే మొదటి సారి కాదు. ఆ మాటకొస్తే తొక్కిసలాటలు అసలు మనకు కొత్తేమి కాదు. కానీ ఈ తొక్కిసలాటల నుండి మనం నేర్చుకున్న పాఠాలు ఏమిటి. వీటిని ఎలా నియంత్రించ వచ్చు అనే దానిమీద చర్చలు జరిపి, తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనే అంశాలపై దృష్టి సారించాలి
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన మరవక ముందే, తిరుపతి లో తొక్కిసలాట, అది మరవక ముందే మహా కుంభమేళా లో తొక్కిసలాట. సంధ్య థియేటర్ ఘటన లో కొంత మానవ తప్పిదం ఉంది. అయితే పుణ్య క్షేత్రాలు, పుణ్య తీర్ధాల వద్ద తొక్కిసలాట వద్ద ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఏదో ఒక రకంగా తొక్కిసలాట ఘంటానాలు జరుగుతూనే ఉన్నాయి
కుంభమేళాలో గతంలో కూడా తొక్కిసలాట ఘటనలు చాలా జరిగాయి. 1954 లో జరిగిన మొదటి కుంభమేళాలో 800 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతే కాక సుమారు 2000 మంది దాకా గాయపడ్డారు. అది కూడా మౌని అమావాస్య రోజు నాడే జరిగింది. ఆ రోజు తొక్కిసలాటకు కారణం ఒక ఏనుగు అదుపుతప్పి జనాల మీదకు రావడంతో ఈ ఘటన జరిగిందని సమాచారం
1986 కుంభ మేళాలో, తొక్కిసలాటలో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ప్రజా ప్రతినిధులు రావడం వలన జనాన్ని అదుపు చేయలేకపోయారు
2003 కుంభ మేళాలో జరిగిన తొక్కిసలాట ఘటన లో 39 మంది ప్రాణాలు కోల్పోయారు.
2013 లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోవడంతో 42 మంది ప్రాణాలు కోల్పోయారు
ఇప్పుడు 2024, కుంభ మేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 30 ప్రాణాలు కోల్పోయారు. సుమారు 100 మంది దాకా గాయపడ్డారు.
కుంభమేళాలోనే కాదు భక్త ప్రవాహం ఉన్న అనేక చోట్ల, అనేక సందర్భాల్లో ఈ తొక్కిసలాటలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు
ఈ తొక్కిసలాటలు కారణాలు అనేకం.
1. భక్తుల ఆరాటం
2. అక్కడి నిర్వహణ వ్యవస్థలో లోపాలు (ఏనుగులను నియంత్రణ లోపం, పటిష్టమైన బారికేడ్లు నిర్మించడంలో లోపం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి మరమ్మతుల్లో జాప్యం, అధికారుల నిర్లక్ష్యం, )
3. ఏదో జరిగింది, జరుగుతోంది అని భయ బ్రాంతులతో అనవసర గందరగోళాన్ని సృష్టించే భక్తుల, జనాల ఆరాటం (ఇటీవల మహారాష్ట్ర జరిగిన ట్రైన్ ఆక్సిడెంట్ ఒక ఉదాహరణ)
ఆ ప్రదేశంలో ఎలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది, ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలన్న అంశాలపై అధికారులకు అవగాహనా లేకపోవడం
ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మనం మాత్రం పరిష్కారాలను వెదికే ప్రయత్నం చేయకుండా తొక్కిసలాట ఘటనలను చరిత్ర పుటల్లోకి ఎక్కించే ప్రయత్నాల్లోనే ఉన్నాము. తొక్కిసలాట జరిగిన వెంటనే నష్ట పరిహారం ప్రకటించే అధికార యంత్రాంగం, ఎప్పుడు అధికార ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేద్దామా అని ఎదురు చూసే ప్రతిపక్షాలు ఉన్నంతవరకు. ఈ సమస్యకు పరిష్కారం లేదు
తొక్కిసలాటలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై చర్చలు జరగాలి. టెక్నాలజీ వాడుకునే అవకాశం ఎంత ఉంది అనే దానిపై కూడా ఆలోచించాలి. ప్రతి దానికి పోలీసులను నిందించకూడదు. వాళ్ళు కూడా మామూలు మనుషులు. ఖాకి డ్రెస్ వేసుకున్నంత మాత్రాన వేలల్లో, లక్షల్లో, కోట్లల్లో ఉన్న జనాన్ని నియంత్రించడం పోలీసులకు కూడా అసాధ్యం.
ఇలాంటి తొక్కిసలాట ఘటనలకు ఏ ఒక్కరినే బాధ్యులను చేయలేము. అక్కడికి వచ్చే భక్తులు లేదా జనాల నుండి ఏర్పాట్లు చూసే అధికారుల వరకు అందరు బాధ్యులే
ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ఏదో అనాలి అని కాకుండా, ఇలాంటి చర్యలు జరగకుండా ఏం చేయాలి అనే దానిపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి.
మీరు మారరా, మీరు, మీరు, మీరు అంతా మారాలి.

